TANA కి వెళ్ళినప్పుడు నవీన్ గారి ని కలవడానికి వారి హోటల్ గదికి వెళ్ళాను . అక్కడ ఉమా మహేశ్వర రావు గారు కలిసారు. వెళ్ళగానే నాకోసం ఏం పుస్తకాలూ తేలేదా అని అడిగా (సరదాగా ). వెంటనే ఉమా చేతి లో ఉన్న అన్నం గుడ్డ పుస్తకాన్ని నాకు ఇచ్చేసారు. నేను దాన్ని కెమెరా సంచి లో పెట్టి మర్చి పోయాను. మళ్ళా సంచి సర్దుతుంటే పుస్తకం కనపడింది. చదువుదాం అని పక్కన పెట్టా ..
ఈ రోజు చెయ్యవలిసిన పని తొందరగా అయి పోవడం తో పుస్తకం మొదలు పెట్టాను. ప్రతి కథా జీవన చిత్రమే మనకి బాగా తెలిసిన కథలే ... ఇది మనవాళ్ళ జివితామే ఏమో అన్న అనుమానం ఒకో కథ చదువుతున్న కొద్ది బలపడి పుస్తకం పూర్తి చేసే సమయానికి ఈయనకి మనకథలు ఎలా తెలుసు ? మన ఇంట్లో మనిషే ఏమో ఇలా రాసాడు అన్న ఆత్మీయతా భావం వచ్చేస్తుంది దేవేంద్ర గారి మీద.
రాబందులు కథ చదువుతుంటే ఊర్లో కుప్పనుర్పిళ్ళ దగ్గరే కనపడే మా ఊరి రైస్ మిల్లు యజమాని కనపడ్డాడు. (ఊర్లో అందరు మనకి బాబాయ్ లు మామయ్యలు కదా , వాళ్ళ కళ్ళల్లో కనపడ్డ నైరాశ్యం ఆక్కడ కనపడింది. )
కడ గొట్టొల్లు కథ చదువు తుంటే ఊర్లో మా ఇళ్ళ వెనకాల ఉండే జనాల జీవితం గుర్తుకు వచ్చింది.. నేను ఆడుకోడానికి వెళ్ళాలి అంటే మా ఇంట్లో చిరాకు పడే వాళ్ళు , మేము హైదరాబాద్ లో పెరగడం వల్ల ఇలాంటివి తేలిక పోవడం తో అర్ధం అయ్యేది కాదు.
అన్నదాత చదువుతుంటే ఎందరు బాబాయిలు గుర్తుకు వచ్చారో... కొల్లేరు మునిగినప్పుడల్లా వాళ్ళ పంటలు మునిగేవిమా ఇంటి ముందర ఎప్పుడు ఆ బాబాయిల గోషీ ... (మా ఇల్లు కొల్లేటి ఒడ్డున ఉండేది లెండి ). మనకి సరిగ్గా లేవువాడికి బియ్యం కొలవమంటావు అనే పిన్ని సనుగుడుకి మా బాబాయి నవ్వు కనపడింది ఆ కథ లో. ..
తమ్మిపూ లు చదువుతుంటే గది అంతా తమ్మిపూల వాసన వస్తున్నా అనుభూతి (నీ మొహం అమెరికా లోతమ్మిపూలు ఏంటి .. రూమీ గాడు రాసుకున్న స్ప్రేయ్ ఏమో అన్న బుడుగు ఎటకారం యాహూ లో )
కొస మెరుపు : ఊరు నుంచి కొడుకు దగ్గరకు వచ్చిన బాబాయ్ గారికి ఈ పుస్తకం ఇచ్చాను చదవమని ... పుస్తకం మొత్తం చదివి అక్కడ ఇదే భాద ఇక్కడ కూడా ఇదేనా .. ఈదేడన్నా కొత్తగా సేపుతాడు అనుకున్నా.. మన బాదలు మళ్ళా కొత్తగా సదవాలా అని రెండు తిట్టులు తిన్నా (అంటే ఎంత బాగా రాసారో ఒక్క సారి ఆలోచించండి )
పుస్తకం ఇచ్చిన ఉమగారికి కృతజ్ఞతలు ...
అన్నంగుడ్డ - కథలు .. రచయిత సుంకోజి దేవేంద్రా చారి . యుక్త ప్రచురణలు (వారి అమ్మాయి పేరు మిద అనుకుంటా ) ధర యాభై రూపాయలు.
3 comments:
ఎక్కడో విన్నా ఈ పేరు అని చాలా సేపు కొట్టుకున్నా, ఇప్పుడే గుర్తు వచ్చింది, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో హైదరాబాద్ లో మొన్న వెళ్ళినప్పుడు చూసేను. రాసుకున్నా కాని తెచ్చుకోవటం కుదరనే లేదు.. బాగుందండీ కథ ల వివరణ...
బాగుందండి పరిచయం.. 'కొమ్మిపూలు' కథ నాకు ఎందుకో ప్రత్యేకంగా అనిపిస్తుంది..
రచయిత సుంకోజి దేవేంద్ర, ఇదే వొరవడి కొనసాగిస్తే సమకాలీన తెలుగు కథా ప్రపంచంలో మంచి ఎత్తుకి ఎదుగుతాడనడానికి ఏం సందేహం లేదు. మూడేళ్ళ క్రితం ముఖాముఖి కలిసి మాట్లాడినప్పటికి ఇంకా కథల సంపుటి అచ్చుకాలా. మొన్నామధ్య, సంపుటి అచ్చయినాక ఫోను చేసి మాట్లాడినప్పుడూ ఆ గొంతులో అదే అబ్బురం, ఆనందం, ఆత్మీయత.
Post a Comment