కథా ప్రియులకి పాపినేని శివశంకర్ గారి పేరు కొత్తగా పరిచయం చెయ్యక్కరలేదు. దాదాపుగా పది సంవత్సరాలుగా వాసిరెడ్డి నవీన్ గారి తో కలిసి కథ సిరీస్ కి సంపాదకత్వం వహిస్తున్నారు. ఆయనతో వ్యక్తిగతంగా నాకు తెలీక పోయినా అయన కథలు వల్ల సుపరిచిరుతులే. అయన TANA కి వచ్చినా నేను అక్కడ సమావేశాలు సరిగ్గా హాజరు కాకపోవడం వల్ల ఆయన్ని అక్కడ కలవడం కుదరలేదు. తరవాత రెండు వారల తరవాత అయన detriot వచ్చినప్పుడు అక్కడ కలిసాను. అక్కడ సమావేశం లో అయన మాట్లాడారు. తర్వాత కృష్ణ రావు గారి ఇంట్లో కలిసినప్పుడు సగం తెరిచిన తలుపు పుస్తకాన్ని అడిగి తీసుకున్నాను.
మొన్న వారాంతం రోజున న్యూయార్క్ వెళ్ళే అప్పుడు దారిలో చదువుదాం అని ఆ పుస్తకాన్ని తీసుకు వెళ్ళాను. పుస్తకం లో మొదటి కథ చింతల తోపు కథ చదువుతూ ఉంటె ఒకప్పటి బాల్యాన్ని ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారు అని అనిపించింది. ఒక బాలుడి బాల్యం తో ముడిపడిన సేద్యపు జీవితం ఎలా మెల్లిగా మారింది అన్నది కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది.
అలాగే ఒక్క వాన కోసం కథ లో జీవితాన్ని జీవితం లాగా ఎలా తిసుకోవచ్చో చాలా బాగా చెప్పారు. ఎప్పటికి ఈ పరుగు అపకపోవడం వల్ల ఎలా ఉంటుందో చెప్పకుండా నే చెప్పారు.
మనం మాట్లాడక పోవడం వల్ల మనుషుల మధ్య లో గోడలు ఎలా పేరుకు పోతాయో ఇంకో కథ లో చెప్పారు.
శివ రెడ్డి గారి కవిత్వం ఎందుకు నచ్చుతుందో.. నారాయణ రెడ్డి గారు ఇంకా ఇంగువ కట్టిన గుడ్డ లాగ పత్రికలని ఎలా తింటున్నారో (పరోక్షంగా ) చెప్పారు.
చివరి పిచ్చుక కథ చదువుతుంటే ఒకప్పుడు మా ఊర్లో ఉండే తుమ్మ చెట్లకి గుత్తులు గుత్తులుగా వేళ్ళాడే గిజిగాడి గూళ్ళు ఇప్పుడు కనపడక పోవడానికి కారణం తెలిసింది ఏమో అనిపించించి. అప్పట్లో తుమ్మ చెట్లు, తుమ్మ బంక కోసం వెళ్లి ఆ గూళ్ళు చూసి, నగరంలో మాకు అవి కనపడవు కదా అని ఎత్తుకొస్తే మా బాబాయి తిట్టిన తిట్లు ఇంకా చెవిలో మోగుతున్నట్టుగా వినిపిస్తాయి.
సముద్రాన్ని ఎక్కడ పరబోయ్యాలో తేలిక మనం కూడా ఆలోచన లో పడిపోతాం సముద్రం కథ చదివాక.
మొత్తం పదహారు కథలు ఉన్న ఈ సంకలనం మనలని ఒక లోకం లో కి తీసుకుపోవడం ఒక అనుభూతి.
మాములుగా మనం ఒక కథ చదివితే రచయిత మనకి తను ఎం అనుకుంటున్నారో విపులంగా చెప్పేస్తారు. మనకి ఎక్కువ ఆలోచించడానికి ఎక్కువ అవకాశం ఉండక పోవచ్చు. కాని శివశంకర్ గారి కొన్ని కథల్లో రచయిత గా అయన చెప్పాల్సింది చెప్పేసి కథ ని మన ఊహకే వదిలేస్తారు. దాని వల్ల ఒక కథ చదువరి మెదడుకి పదును పెడుతుంది. కథ కొంతకాలం తప్పకుండా వెంటాడుతుంది.
ప్రతి కథ దేనికి దానికి బిన్నంగా, ప్రతి కథ లో కూడా వస్తు వైవిధ్యాన్ని దాంట్లో కూడా మర్కిజం అస్తిత్వం ఇలా భిన్నమైన సబ్జెక్టు లను అవలీల గా చర్చిస్తారు. అలా అని తన భావాలని మన మిద రుద్ద కుండా మన ఆలోచనలని పదును పెట్టె లాగా రాసారు.
ఈ కథా సంకలం అన్ని పుస్తక విక్రేయ కేంద్రాల్లో లభ్యమవుతాయి. వేల డెబ్భై రూపాయలు. అమెరికా లో అయితే avkf.org వాళ్ళ సైట్ లో దొరుకుతుంది. వేల సుమారుగా ఒక డాలరు అరవై సెంట్లు.
1 comment:
కొన్ని కథలు చదివాను, వేర్వేరు పత్రికల్లో.. సంకలనం తీసుకోవాలి..
Post a Comment