మొన్న న్యూజెర్సీ వెళ్ళినప్పుడు వాసు , కుప్పిలి పద్మ కథలు మంచుపూల వాన కథా సంపుటం ఇచ్చారు. న్యూ జెర్సీ నుంచి Detriot వెళ్ళే దారిలో కథలు అన్ని చదివేసా. కాని detriot లో ఉండే బిజీ వల్ల పుస్తకం గురించి రాసే సమయం దొరకలా. పుస్తకం మొత్తం చదివాక ఎం రాయాలా అని ఆలోచిస్తే .. ఒకప్పుడు బెంగాలి కథల మిద ఒకరు వేసిన విమర్శ గుర్తుకు వచ్చింది. బెంగాలి కథలు అంటే బండెడు పాద ధూళి , కుండెడు కన్నీళ్లు అని. అలాగే పద్మ గారి కథలు చదవుతుంటే దాదాపు అన్ని కథలలో ఉదా రంగు ఆకాశం, పూలు, వర్షం పడిన సాయంత్రం. తప్పని సరి. అలా అని కథలు బాగా లేవా అంటే బాగానే ఉన్నాయ్,. కానీ అంత ఆకాశాన్ని అన్ని పూలని ఒక్కసారే చదవటం కష్టం ఏమో.
ఒక్కోసారి కథలు చదువుతుంటే దాదాపు అన్ని కథల ఫార్మటు ఒకే లాగ ఉంది అన్న భావన వస్తే మనతప్పు కాదు. ఉదాహరణకి ఒక restuarent లో వంటవాడు ఉన్నాడు అనుకుందాం. అతను వంటకు ముందర అన్ని మసాలాలు సిద్దం చేసుకుని , వంట ఆర్డర్ రాగానే దాని బట్టి మసాలాలు కలిపి పొయ్యి మిద పెట్టి వంట పూర్తీ చేస్తారు. అలాగీ ఈ కథలు కూడా ఉన్నాయ్ ఏమో అని ఆ సందేహం . పైన చెప్పినట్టు అన్ని కథల్లో ఆకాశం , పువ్వులు , మబ్బులు , వర్షం లాంటివి తప్పని సరి. అన్నిటిలో ఉండే ఇంకో సహజమైన విషయం, అమ్మాయిలు మంచి వాళ్ళు , అబ్బాయిలు మనసు చంచలం, అమ్మాయిలు వాళ్ళ భావాలకి నచ్చక పొతే సుబ్బరంగా వాక్ అవుట్ చేస్తారు. చాల వరకు కథలు ప్రేమ మీదే , భావుకత ఉన్న అమ్మాయి , ఇంకో భావుకత ఉన్న అబ్బాయి ప్రేమలో పడటం ఇద్దరికీ ఆర్థిక ఇబ్బందులు ఉండవు , ఉన్నా ఆ ప్రేమ తిని తాగేసే రకాలు లాంటి కథలు .
అన్ని కథలు అలాగే ఉన్నాయ్ అని కాదు. అన్నిటిలో నాకు నచ్చిన కథలు అమ్మకో ఇల్లు. దీంట్లో కూడా మొక్కలు పూలు లాంటివి ఉన్నా కాని మంచి కథ. ఒక కూతురు తన తల్లికి ఒక ఇల్లు కొనివ్వడానికి దారి తీసిన పరిస్ధితులు , పర్వ్యసానం చక్కగా ఉంది. ఇంకో మంచి కథ చెమ్మగిల్లిన ఆకాశం. కమింగ్ అఫ్ ది ఏజ్ కథ వర్షపు జల్లు. రెండు కథలు drainage సమస్యలు హైదరాబాద్ లో ..
కథలు చదివించేవి గా ఉన్నా , కొన్ని మంచి కథలు ఉన్నా , సమస్య అల్లా దాదాపు అన్ని కథల్లో ఉండే ప్రకృతి వర్ణన చాల వరకు ఒకే రకంగా ఉండటం.
మంచుపూల వాన - కుప్పిలి పద్మ కథలు , వేల తొంభై అయిదు రూపాయలు
2 comments:
పద్మ గారి కథలు చదవడం మీకిదే మొదటిసారనుకుంటా.. ఊదా రంగు ఆకాశం, లేత రంగు పూలు తప్పవు.. కొన్ని కథల్లో ఈ తరం అర్బన్ అమ్మాయిల ఆలోచనలు పట్టుకున్నారు.. అది నచ్చింది నాకు ఈ పుస్తకంలో.. ఒకే రచయిత/రచయిత్రి కథల సంపుటంలో కథలు వరుసగా చదవక పోవడమే మంచిదన్నదే నా అనుభవం కూడా..
లేదండి ... పద్మ గారు దాదాపు గా పదేళ్లుగా తెలుసు శీతవేళ రానీయకు చదివి పరిచయం చేసుకున్నాను. అర్బన్ అమ్మాయిల మనస్తత్వం బాగా పట్టుకుంటారు .. కానీ అన్ని కథలు ఒకే రకం గా ఉండటం బాగోదు.. మీరు మధురాంతకం రాజారాం గారివి గమనించండి వస్తు వైవిధ్యం ఎలా భిన్నంగా ఉంటుందో అలాంటి వాళ్ళ కథ సంపుటాలు ఎన్ని సార్లు అన్న చదవవొచ్చు.
Post a Comment