Sunday, August 2, 2009

మగధీర


మాములుగానే మొదటి రోజు నేను ఉన్న ఊర్లో ప్రింట్ రాకపోవడం వల్ల సినిమా చూడలేక పోయాం. ఇంకా మాములుగా ఆ ఎదవ exibitor / డిస్ట్రిబ్యూటరూ ఫోన్ ఎత్తడం కానీ , ప్రెస్ రిలీజ్ కానీ ఇవ్వలేదు చాలా మాములుగా ధియేటర్ కాడికి వెళ్లి మేము ఎదవలం అయ్యాం. సరే అని మరసటి రోజు ఆరుగంటల ఆటకి టికెట్ కొందాం అనుకున్నా, లేవు పో అన్నాడు exibitor . సరే అని జే కి ఫోన్ చేస్తే తొమ్మిది గంటల ఆటకి టికెట్స్ తీసుకున్నా అన్నాడు. తొమ్మిదికి కాదా ఏడు గంటలకి ఇంటికి కాడ బయలుదేరవచ్చు లే అనుకున్నాం. ఈ లోపల ఫోన్ మధ్యలో ఒక స్పెషల్ షో వేస్తున్నాం రండి బాబు అని.. సరే అని ఏడున్నర కి ఉండేలా రున్నింగ్ రేస్ (కారు లో నే లెండి ) మొదలు పెట్టి , సమయానికి అన్న ముందరే చేరుకున్నాం. రా రమ్మని రారా రమ్మని మనకోసం కుర్చీలు ఆపరు కదా ఎవరు అందువల్ల నేలక్లాస్స్ తప్పలా మాకు.. నాకు అక్కడ చూస్తె బొమ్మ (సినిమా) చూసినట్టు ఉండదు కదా. అందువల్ల వెనక్కి వెళ్లి నిల్చున్నా.

చిత్రం మొదలు పెట్టాక బూజు బూజు గా మొదలయింది (లెన్స్ సరిగ్గా లేక ) బంగారు కోడిపెట్ట పాట సగం అయ్యేదాకా. అప్పుడు జనాలు గోల పెట్టారు అని మళ్ళా మొదటి నుంచి మొదలు పెట్టారు లెన్స్ సరి చేసి. సినిమాలో మొదటి సగం కథ ఎం జరిగినట్టు కనపడదు. నాయకా నాయకుల మధ్య ప్రేమ నాయకుడికి ఏదో పూర్వజన్మ స్మృతులు కనపడటం తప్ప.

రెండో సగం మొదలు కాగానే ఒక అద్బుత ప్రపంచం లో కి వెళ్ళిన భావన. ఆర్ట్ డైరెక్టర్, చాయగ్రాహాకుడు కలిసి ఆడుకున్నారు వాళ్ళకి దర్శకుడు తోడయ్యాడు. ప్రతి దృశ్యం ఒక చాయ చిత్రం లా ఉంది.. మనవాళ్ళు ఎవరికీ తీసి పోము అని నిరూపించారు. ఫ్లాష్ బ్యాక్ అవ్వగానే చిత్రం హటాత్తుగా చివరకి వచ్చేస్తుంది. శ్రీహరి పాత్రకి ఫ్లాష్ బ్యాక్ అయ్యాక వచ్చే సన్నివేశాలకి సరిగ్గా సంయమనం కుదరలేదు .

చిత్రంలో లోపాలు లేవా అంటే చాలా ఉన్నాయ్ . బ్రహ్మానందం , హేమ పాత్ర లకి తల తోకా లేదు. ఆలి పాత్ర అసలా కనపడలా. సునీల్ పాత్ర రెండో సగం లో కనపడదు, సలోని పాత్ర దండగ. హీరో కి వాచకం స్పష్టంగా లేదు (కొత్త హీరోలకి అందరికి అదే సమస్య లెండి , అందువల్ల క్షమించేయ్యవచ్చు నాకు తెలిసి ఒక తెలుగు సినిమాని ఒక దృశ్య కావ్యంగా ఒక వర్ణ చిత్రంగా ఇంత బాగా చెయ్యగలగడం ఈ జనరేషన్ లో గొప్పగా చెప్పుకొనవచ్చు. నాకయితే మొదటి సగం నచ్చక పోయిన రెండో సగం కోసం సినిమా ఎన్ని సార్లు అయిన చూడొచ్చు.. (ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అవ్వగానే లేచి రావచ్చు కూడా )

2 comments:

మురళి said...

రిలీజ్ షో చూసిన ఒక మిత్రుడు కూడా ఇదే మాట చెప్పాడు.. రెండో సగం కోసం చూడాలి, అందులో కూడా చాలా లోపాలున్నాయి అని.. మూడు గంటలు ఎలా నిలబడ్డారండీ?

శ్రీ said...

సినిమాల మీద ఉన్న ప్రేమ మరి ఎం చేస్తాం చెప్పండి ...ఇలాంటి అప్పుడే నాన్నగారు చెప్పిన ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని డైలాగు గుర్తుకు వచ్చేది