Saturday, August 8, 2009

నిన్న ఖదీర్ నేడు గోపిని...

ఖదీర్ సాక్షి దినపత్రిక లో ఒక వంతు అని ఈ మధ్య ఒక కథ రాసారు అది ఒక రోజు అతిధి (రచయిత: నిర్మల్ వర్మ (ఇంగ్లీష్ ) కథని భీమసేన్ నిర్మల్ గారి తెలుగు లోకి అనువదించారు . ఆ కథ ని ఖదీర్ గారు చాల బాగా సొంతం చేసుకున్నారు అని ప్రపంచ వల (వరల్డ్ వైడ్ వెబ్ ) లో బోలెడు చర్చ జరుగుతోంది.. ఆ వేడి ఇంకా చల్లారక ముందరే ... సాక్షి లో ఆగష్టు రెండున వచ్చిన ఆదివారం పత్రిక లో గోపిని గారి నేరము - శిక్ష అన్న కథ వచ్చింది. అది ( Bom yeoreum gaeul gyeoul geurigo bom (2003) aka Spring, Summer, Autumn, Winter... and Spring అన్న కొరియన్ సినిమా లో సన్నివేశాలతో ప్రేరణ పొంది రాసారు.

గోపిని గారు ఇలా రాస్తారు అని ఎప్పుడు అనుకోలా ... పాఠకుల కోసం ఆ చిత్రం లో సన్ని
వేశాలని కథని ఇక్కడ పెడుతున్నా .. మీరే న్యాయ నిర్ణేతలు ... (ఇక్కడ ఉన్న వీడియో edited వెర్షన్ ) సినిమా కథ కి ఈయన రాసిన కథ చాల వరకు ఒకటే.

9 comments:

Kathi Mahesh Kumar said...

కథ చదవగానే అనుకున్నాను. హేమిటో, ఈ కొత్త కథకులు! స్ఫూర్తిపొందితే చెప్పుకోవడంలో తప్పేముంది? రాయల్టీ ఎవరూ అడగటం లేదుకదా!

Kottapali said...

అసలిది గోపిన్ ఇష్టైలు కాదు, గోపిని ఇదివరకటి కతలు (కానగపూల వాన, బారతం బొమ్మలు .. ఇలా) చదివి ఇచ్చదివితే చప్పగా ఉంది. స్ఫూర్తి ఇంకోచోట పొందినా కాస్త మంచి కత రాయచ్చౌగా, ఇట్లాంటి చాప్పటి కతెందుకూ .. వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలా.

budugu said...

గోపిని కానగపూల వాన చదివి మనకో న్యూ ఏజ్ రైటర్ దొరికాడని, మాజిక్ రియలిజాన్ని భలే వాడుకుంటున్నాడని ఓ... పనిగట్టుకొని అడిగినవారికి అడగనివారికి చెప్పేవాణ్ణి నేను. ఈ వ్యవహారమంతా చూశాక, అసలు అవి కూడా ఒరిజినలా కాదా అన్న అనుమానం వస్తుంది. షేం ఆన్ యూ గోపిని. అందులో తిరపతి కథలు అని రాసినపుడు ఇవి ఆత్మకథలు ఇంకా నిజాయితీగా ఉండాలి. నిజంగా గోపిని సంజాయిషీ ఏమిటో వినాలని ఉంది నాకు.
ఇట్లు మీ..

మురళి said...

మొదటినుంచీ కూడా ఈ తిరుపతి కథలు నాకు చప్పగానే అనిపిస్తున్నాయండి.. చాలా కథల్లో జీవం లేనట్టుగా, రచయిత బలవంతంగా రాస్తున్నాడా అన్నట్టుగా ఉంటున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన విషయం నన్నేమీ ఆశ్చర్య పరచలేదు.. బలవంతంగా 'రాశాను' అనిపించుకోడానికి ఇలా ఈదారి పట్టారన్నమాట.. మనసు పెట్టి రాస్తే గోపిని మంచి కథలు రాయగలరు అనడానికి అతని గత కథలే నిదర్శనం..

ఉమ said...

శ్రీను
కొరియా సినిమా క్లిప్ చూసాను. గోపిని కథ చదివాను . దీనిని కాపి అనవచ్చునా . బాల్యం కొరియాలో అయినా అమెరికాలో అయినా ఆంధ్రాలో అయినా ఒకేలా వుంటుంది. కప్పకి దారం కట్టడం, తూనీగకి చిపుర పుల్ల గుచ్చడం , తొండని చంపడం, కుక్కని రాయితో కొట్టడం వంటి సంఘటనలు బాల్యంలో సహజం. కొరియాలో సినిమా తిసారుకద అని ఇంకెవరూ తమ బాల్యంలోకి వెళ్లకూడదా . మార్క్ ట్వైన్ లో నామినిని , నామినిలో ఖదిర్ని చూస్తున్నాం కదా . వొకరి బాల్యం మరొకరికి కాపీనే . కొరియా సినిమాలో దృస్య రూపంలో కనిపించడంవల్ల జెరాక్స్ దిమ్చేసాడు గురుడు అనిపించింది. ఇటువంటి పోలికల్ని కథల నుంచి సినిమాల్లో , సినిమాల్లోంచి కథల్లో చాలా వెతుక్కోవచ్చు.
-ఆర్ ఎం ఉమామహేశ్వర రావు

budugu said...

ఉమా గారు,

మీ సమాధానం చూసి ఆశ్చర్యమనిపించింది. నామినిలో, ట్వైన్‌ను చూడ గలుగుతున్నామంటే కారణం, వారు సార్వజనీనమైన బాల్యాన్ని వాళ్ళ కోణంలో చాలా నిజాయితీగా ఆవిష్కరించారు కాబట్టే.
కుక్కని రాయితో కొట్టడం, తొండని చంపడం బాల్యంలో చాల సహజమైన సంఘటనలే. కానీ భూతదయను గురించి అంత చక్కగా బోధించడం మాత్రం చాలా అసాధారణమైన సంఘటన. మీరే ఒక వంద/వేయి మంది తెలుగువారిని ప్రశ్నించి చూడండి ఇలా ఎవరికైనా పనిష్మెంటు ఇవ్వడం జరిగిందా అని? ఇక కథకి వస్తే కొరియా సినిమాలో ఇది చాలా సహజంగా అతికినట్టుంది. జెన్, టావో గురువులు, మార్షల్ ఆర్ట్స్ గురువులు ఇలా వినూత్న రీతిలో శిష్యులకు పాఠాలు బోధించడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. కాని తాతలు, బామ్మలు, అందులో తెలుగు తాతలు మనవలను శిక్షించడం, అందునా ఇంత యునీక్‌గా శిక్షించారన్నదే కాస్త అసహజంగా ఉన్నది. ఇది ముమ్మాటికీ ఇన్స్పైర్డ్ రచనే అనడానికి నాకైతే ఎటువంటి సందేహం లేదు. మరో విషయం నిజంగా ఇలాంటి ఘటన జరిగుంటే గోపినిలాంటి కథకుడు ఈపాటికి దీన్ని అద్భుతంగా రాసి ఉండేవాడు. ఇది చాలా సబ్జక్టివ్ విషయం కాబట్టి దీనికి సాక్ష్యాలు, ఆధారాలు దొరక్కపోవచ్చు అంతరాత్మ మినహా..
ముగించే ముందు, నాకు గోపినితో ఎట్టి శత్రుత్వమూ లేదని చెప్పాలనుకుంటున్నాను. ఐతే గీతే, తెలుగులో పది గొప్ప సమకాలీన రచయితలెవరంటే గోపిని, గోపిని అని అరచేవాణ్ణి ఇప్పటివరకు. ఇందుకు శ్రీనుయే సాక్ష్యం.
ఇట్లు మీ..

Ruth said...

హా! నిజంగానా? నేను అస్సలు ఎక్ష్పెచ్త్ చెయ్యలెదు ఇలంతి విషయం గొపిని గారినుంచి. కొన్ని కథలు నాకు చాల నచ్చాఇ కూడాను. అందుకే తన కథలు ఆపేసారా ఏంటి?

Ruth said...

హా! నిజంగానా? నేను అస్సలు ఎక్ష్పెచ్త్ చెయ్యలెదు ఇలంతి విషయం గొపిని గారినుంచి. కొన్ని కథలు నాకు చాల నచ్చాఇ కూడాను. అందుకే తన కథలు ఆపేసారా ఏంటి?

శ్రీ said...

కథలు అందువల్ల ఆపి ఉండక పోవచ్చు అండి .. గోపీకి గారికి సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది .. అందువల్ల కాళి లేకపోవడం వాళ్ళ అయి ఉండవచ్చు