మాములుగా మనకన్నా పెద్దవాళ్ళని వరసని బట్టి మామయ్యా , అత్తయ్య, అక్క , బావా గట్రా వరసలతో పిలిచేస్తాం కదా. కొత్త వాళ్ళయితే ఇప్పుడు అందరు అంకుల్లు , అంటీ లే కదా. అదే మనకంటే పెద్ద వాళ్ళు అయి మనకి వరసకి చిన్న వాళ్ళు అయితేనో లేక మనకన్నా కొంచం చిన్న అయి మనని మరి పెద్ద వాళ్ళని చేసేస్తే నో వచ్చే ఇబ్బంది లాంటి కామెడి భలే గా ఉంటుంది కదా..
నేను బడిలో ఉండగానే ... అంటే నాలుగైదు తరగతుల్లో అనుకుంటా ... ఒక రోజు డిగ్రీ అయిపోయిన మా చుట్టాలబ్బాయి బడికి వచ్చాడు నన్ను తొందరగా తేసుకు వెళ్ళడానికి.. వరస ప్రకారం నేను తనకి బాబాయ్ అవుతాను. అందువల్ల (మరియు నన్ను ఏడిపించడం కోసం ) నన్ను బాబాయి అనే పిల్చే వాడు. తను తరగతి గదికి వచ్చి మా శ్రీను బాబాయ్ ని తెసుకేల్లోచ్చ అని పంతులు గారిని అడిగారు. ఇంకా చూసుకోండి క్లాసు అంతా ఒక్క సరి గొప్ప కలకలం అండ్ నవ్వులు... నాకు గొప్ప సిగ్గు అండ్ అవమానం ( ఆ సమయం లో రెండు ఒక్కటే అని అనుకునే వాడిని లెండి ). తనతో ఇంకా వారం మాట్లాడితే ఒట్టు. తను గదిలో కి వస్తే వేరే గదిలో కి వెళ్లి పోయేవాడిని.. నాన్నగారు కూర్చో పెట్టి వరస పెట్టి పిలవడం లో తప్పు లేదు అని నాకు సర్ది చెప్పారు . అక్కడికి అది సర్దు మణిగింది. అప్పటినుంచి నేను ఆ పిల్పు కు అలవాటు పడిపోయాను. తను నన్ను ఇప్పటికి అలాగే పిలుస్తాడు.
కట్ చేస్తే ఇప్పుడు అతను అమెరికా లో ఉన్నాడు.. మొన్న మద్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అబ్బాయి కి పదిహేను ఏళ్ళు అనుకుంటా . పిలిచి మీ తాతగారు అని పరిచయం చేసారు. ఆ అబ్బాయి ఒక చూపు చూసి. He don't look that old. I cannot call him as తాతగారు అనేసి చక్క వెళ్ళిపోయాడు. నాకు నవ్వు ఆగలేదు . మళ్ళా భోజనలకాడ కలిసాడు. నాకు తాతగారు అని పిలిస్తే నేను ఎం ఫీల్ కాను అని అన్నాను. ఒక సరి ఎగా దిగా చూసి I think I can call you as brother అని తీర్మానం చేసేసి ఇదే నా తీర్పు లాగా వినిపించేసాడు.
TANA కి వెళ్ళినప్పుడు, మా మేనకోడలు, తన భర్త తో banquet కి వచ్చింది. అబ్బాయి ఆరడుగుల కన్నా ఇంకో ఇంచి ఎక్కువే. తనని తీసుకు వెళ్లి సిరివెన్నెల గారికి మా అబ్బాయి అని పరిచయం చేశాను ఆయనకి ఒక నిమషం అర్ధం కాలా పాపం. నీకు పెళ్లి అయిందా ? అప్పుడే ఎంత పెద్ద కొడుకా అని ఒక గుక్క తిప్పుకోకుండా అడిగేసారు. ఆయనకి అప్పుడు చుట్టరికం చెప్పను. అంత పొడవు అబ్బాయి ని పాలనా వాళ్ళ భర్త అని ఎం పరిచయం చేస్తాము, కాంతం గారి మొగుడు టైపు లో కష్టం కదా .. అలా రెండు సార్లు అయ్యే సరికి పాపం అబ్బాయి సిగ్గు పడిపోయి బాబాయ్ మనం కజిన్స్ అని చెప్తే ప్రాబ్లం ఉండదు ఏమో అది బెటర్ ఆప్షన్ ఏమో అన్నాడు..అలా కాదులే మా వాడు అని చెప్తా లెండి అన్నా అక్కడి నుంచి ఎవరకి పరిచయం చెయ్యాలి అన్న మా వాడు అని అటు ఇటు కాకుండా పరిచయం చేశా.
నిన్న ఇంకో అబ్బాయి వచ్చాడు. తను కూడా నాకు వరసకి అబ్బాయే.. కొత్తగా పెళ్లి అయింది . చాల ఇబ్బంది పడి పోయాడు. ఇమ్మలని బాబాయి అని పిలవాలంటే .. అన్నా అని పిలవోచ్చ అని అడిగాడు... నీకు ఇబ్బంది లేన్దినిది ఏదన్న పరవాలేదు లే అంటే ఇంకా అప్పటి నుంచి అన్న అనడం మొదలు పెట్టాడు...
1 comment:
:-) :-) అందరికే ఏదో ఒక సమయంలో వచ్చే సమస్యే.. కాకపొతే మీక్కొంచం ఎక్కువగా వస్తోంది...
Post a Comment