Wednesday, August 19, 2009

మిస్టర్ ఆంజనేయులు - చిత్ర సమీక్ష

యువత చిత్రం తీసిన దర్శకుడు పరశురాం రెండో సినిమా ఇది. యువత లో నిఖిల్ ని రవితేజ లాగా చూపించిన పరశురాం ఈ చిత్రం లో రవితేజ నే నాయకుడిగా తీసుకోవడం తో అలా ఇంకో హీరో ని రవితేజ లాగా చూపించే బాధ తప్పింది. రవితేజ చాలా మాములుగా చాలా ఓవర్ ఆక్షన్ చేసాడు. (దాన్ని అయన దృష్టి లో ఎనర్జీ లెవెల్స్ అంటారు అంట లెండి ) .

సినిమా కి అనధికార నిర్మాత మంత్రి బొత్స సత్యనారాయణ అని ఒక కథనం అధికారికంగా చిన్న చితకా వేషాలు వేసే హాస్య నటుడు గణేష్! మీరు గమనించారో లేదో కాని మంత్రివర్గం ప్రమాణ స్వీకారం అప్పుడు ఈయన (గణేష్ ) మంత్రి గారి వెనకే కుర్చుని ఉన్నారు .

సరే కథ కి వస్తే అన్ని పూరి చిత్రలలాగే దీంట్లో కూడా నాయకుడు ఒక రకమైన పోరంబోకు. ఒక టీవీ ఛానల్ లో పని చేస్తా ఆ ఛానల్ అదినేత ని లెక్క చెయ్యకుండా ఇష్టం వచ్చినట్టు చేసే (దీనే తెలుగు సినిమా పరిభాషలో నాయకత్వ లక్షణములు అందురు) అతను. ఇంకా మాములుగా నాయకి వెనకాల చిల్లర వేషాలు వేసి ప్రేమించేసా అనడం. ఆ పిల్లకి వేరే దిక్కులేక వీడే నాయకుడు కావడం వాళ్ళ ప్రేమిచేయ్యడం షరా మామూలు. నాయకుడి కి ప్రతినాయకుడి తో గొడవ. ప్రతినాయకుడు ఇంకొంత మంది తొట్టిగాంగ్ తో కలిసి నాయకుడి కి అన్యాయం చెయ్యడం. నాయకుడు ప్రతీకారం తో అందరిని మట్టుపెట్టడం. పోలీసులు నాయకుడి ని ఆహా ఒహో అనడం షరా మామూలు .

కథనం , సంభాషణలు అన్ని మనకి ఇంతకు ముందు చుసిన లెక్క లేని అన్ని సినిమాలు గుర్తుకు వస్తాయి. శ్రీనివాస్ రెడ్డి హీరో పక్కన ఉండి, మాటకి ఒక చెంపదెబ్బ తినే పాత్ర. ఇలాంటివి సునీల్ కాని శ్రీనివాస్ రెడ్డి కాని బోలెడు సార్లు చేసారు. కొత్తదనం ఎం లేదు దాంట్లో. బ్రహ్మానందం పాత్ర కూడా అంతే. కొన్ని సంభాషణలు వింటే మనకి పోకిరి, బుజ్జిగాడు సినిమాలకి బాగా పాపులర్ ఆయనవి కొంచం అటు ఇటు మార్చి రాసాడు అని అనిపించడం లో తప్పు లేదు. తెర మీద పాత్ర ఎం చెప్పబోతోందో ముందే ఊహించగలం అలా ఉన్నాయ్ సంభాషణలు. పోనీ సన్నివేశాలు చూద్దామా అంతే అవి కూడా పాత సినిమాల కి కొన్ని నకళ్ళు. ఒక్కడు, ఒకే ఒక్కడు లాంటి సినిమాల్లో నుంచి కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు యదాతధం గా వాడుకున్నారు.

ప్రతినయకులని పట్టించడానికి నాయకుడు, స్నేహితుడి తో కలిసి వాళ్ళు చేసే వెధవ పనులని వీడియో తీస్తాడు. కామెడి ఏంటి అంతే.. ఆ వీడియో లో వీడియో తేసే స్నేహితుడు కూడా కనపడతాడు. మరి వీడియో ఎవరు తీసారు చెప్మా అని ప్రేక్షకుడికి బేతాళ ప్రశ్న.

నాయక పాత్ర అందాల అడ బొమ్మ. చెయ్యడానికి ఎం లేదు. అలా అని అందం గా కూడా లేదు అదేంటో గాని. అంటే ఆంజనయులు కదా అలా ఉన్న సరిపోతుంది అనుకున్నారో ఏంటో తెలిదు మరి.

సినిమాలో నచ్చింది ఒక్కటే.. నిర్మాత దిల్ రాజు ని టార్గెట్ గా పెట్టి ఎం ఎస్ నారాయణ చేత వేయించిన వేషం. ఇది ఒక్కటే బాగుంది. మరి పరుశురాం కి అయన మీద అంత కోపం దేనికో తెలిదు. సంగీతం సో సో. కెమెరా బాగుంది సినిమా లో ఉన్న అదృష్టం ఏంటి అంటే ఎక్కడ నుంచి అన్న సరే చూడొచ్చు. ముందర చూడలేదే ఎమన్నా మిస్ అయ్యామే అన్న భాద లేదు.

5 comments:

కన్నగాడు said...

ఉన్నది ఉన్నట్టుగా రాసారు, ఆ భేతాళ ప్రశ్న నాకూ ఉదయించింది. ఇక ఎమ్మెస్ పాత్ర దిల్ రాజుది కాదేమో! దిల్ రాజు దిల్ దగ్గరి నించి చాలా సినిమాలు హిట్లే కదా, కాని ఎమ్మెస్ ని ఒక పరమ చెత్త నిర్మాతగా చూపించాడు. నేనేదైనా లింకు మిస్సయితే అందించగలరు.

శ్రీ said...

దిల్ రాజు గారు హిట్స్ ఇచ్చారు కాదని అనడం లేదు అండి.. కాని కొత్త బంగారులోకం చూసారా.. సినిమా లో పదో క్లాసు ప్రేమ ఎ కదా అంది.. తల్లి వాడి కి ఆ అమ్మాయి ని నాలుగు లేక అయిదు ఏళ్ళు దాచి బహుమతి గా ఇస్తుంది... ఆ సమయం లో ఆ అమ్మాయి తల్లి తండ్రుల గురించి ఒక్క సారి కూడా ఆలోచించదు మరి అది ఎలాంటి తల్లి హృదయమో నాకు అర్ధం కాలా.. ఆ ప్రోమోస్ లో దిల్ రాజు గారు వేసిన చొక్కా లాంటిదే ఎం ఎస్ గారి చేత వేయించారు .. (ఇది మా కజిన్ గారి అబ్సేర్వషన్ )

కన్నగాడు said...

అది అక్కడ పప్పులో కాలేసా! నేను ఇండియాలేను లెండి, ఐతే దిల్ రాజునే కావచ్చు, కొత్తబంగారు లోకం సినిమాకి నాలుగో నాలుగున్నరో రేటింగు ఇవ్వడమే ఇంతవరకు అర్థం కాలేదు. నాకు అంతగా నచ్చలేదా సినిమా.

మురళి said...

'ఈ సినిమా చూడనా?' అని ఒక మిత్రుడిని సలహా అడిగితె 'జీవితం మీద అప్పుడే విరక్తి వచ్చేసిందా?' అని అడిగాడు.. బాగుందండి మీ రివ్యూ...

Money Purse said...

బాగా చెప్పారు, నేను ఆఫీసులో ఉండగా మా ఫ్రెండ్స్ అందరూ నన్ను వదిలేసి ఈ సినిమాకి వెళ్లారు, వెధవలు బుక్ అయిపోయ్యారు. నిజంగానే రవితేజ ఓవరాక్షన్ ఎక్కువయ్యింది ఈ మధ్యన... కిక్ చూసాక ఇంకోసరి రవితేజ సినిమా చూడకూడదు అనిపించింది.