మొన్నామధ్య ఒక స్నేహితుడు 3 - IRON (original title : Bin-jip, meaning Empty Houses) అన్న కొరియన్ సినిమా చూడొచ్చా అని అడిగాడు. ఆ సినిమా దర్శకుడు Kim Ki-duk తీసిన spring summer మాకు బ్రహ్మాండంగా నచ్చేయ్యడం వల్ల , వరస పెట్టి అయన తీసిన చిత్రాలు అన్ని చూసేసా. ఇంకా త్రీ ఐరన్ చూడాల వొద్దా అని మా వాడు బొమ్మ బొరుసు వేసుకునే సమయం లో తెలుగు లో జాటర్ దామల్ అంటూ రెండు సినిమాలు కొంచం అటు ఇటు గా వచ్చేసాయి. త్రీ ఐరన్ లో హీరో పిజ్జా డెలివరీ బాయ్. పగటి పూట అపార్ట్మెంట్స్ లో కి వెళ్లి తలుపులకి పిజ్జా advertisements పెట్టి , సాయంత్రం అవి ఇంకా అక్కడే ఉన్నాయ్ అంటే , ఇంట్లో ఎవరు లేరు అని డిసైడ్ అయ్యి ఆ రాత్రి కి ఆ ఇంట్లో మకాం వేస్తూ ఉంటాడు. అలాంటి ఒక ఇంట్లో ఒక రోజు నాయకి తారస పడుతుంది కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయి వీడితో వచ్చేసి వీడిలాగే రోజు కో ఇల్లు మారుతూ ఉంటుంది. మెల్లిగా విల్లదరి మధ్య ప్రేమ ఉదయిస్తుంది. .
చార్మి నటించిన 16 days అని ఈ మధ్యే ఒక సినిమా వచ్చింది గుర్తు ఉందా. దాంట్లో చార్మి చేసేది అదే పని. అక్కడే ఒక ఇంట్లో ఆ అమ్మాయి కి నాయకుడు పరిచయం అవుతాడు. అక్కడి నుంచి కథ lucky number sleven అన్న ఇంకో సినిమాలోకి వెళ్తుంది.
స్నేహితుడా సమీక్ష అని ఇదేం సోది అనుకోకండి. ఇది కూడా ఆ సినిమా తాను లో ని ముక్కే.
సాయి (నాని ) అనాధ (తెలుగు సినిమాల్లో చాలా మంది నాయకులు అనాధలె ఈ మధ్య అదేంటో కాని, అలా అయితే సపోర్ట్ కాస్టింగ్ బాధ తప్పుద్ది అని ఏమో మరి). పైన చెప్పిన విధంగా రోజు ఒక ఇంట్లో గడిపేస్తూ ఉంటాడు. అలా ఒక రోజు వెళ్ళిన ఇంట్లో నాయకి సావిత్రి (మాధవి లత) కనపడుతుంది. ఆమె ఇష్టం లేని పెళ్లి తప్పించుకోడానికి ఇంట్లో నుంచి షరా మాములుగా పారిపోయి వస్తుంది. అది తండ్రికి ఇష్టం లేక నీ మొహం నాకు చూపించకు అంటాడు. అక్కడి నుంచి నాయకుడు ఎం చేసాడు వాళ్ళని ఎలా కలిపాడు గట్రా గట్రా తో సినిమా సా....గుతుంది
సినిమా చాల వరకు మూలం లో ని సన్నివేశాలని తీసుకుని, మన వాళ్ళకి సరిపడేలా మర్చి దానికి కాసింత కామెడి, కూసింత సెంటిమెంట్ కలిపి బాగానే వందారు.
సినిమా మొత్తం నాని మోసాడు ఒకరకం గా అని చెప్పుకొనవచ్చు. కాని కొత్త హీరోలు అందరిలాగే ఈయనకి కూడా పెళ్లి , తాళి లాంటి వి పలకడం రాదు . భాష సుబ్బరంగా ఖూనీ చెయ్యగలడు. నటన , నాట్యం లాంటివి బాగానే చేసాడు. మాధవి లత పర్వాలేదు. లయ, అక్షర సీరియల్స్ లో వచ్చే రవికిరణ్ ఈ చిత్రం ద్వారా ప్రతినాయకుడి పాత్రలో కనిపించాడు. బాగానే చేసాడు. బ్రాహ్మి సో సో, ఎం ఎస్ నారాయణ అంటే తాగుడి పాత్ర. అయన అలాగే లాక్కు వచ్చాడు. నాజార్ కి వెరైటీ గా ప్రేమాయణం ఫ్లాష్ బ్యాక్ పెట్టారు. అది బాగానే ఉంది. సత్యం బెల్లంకొండ గారికి ఇదే మొదటి చిత్రం దర్శకుడిగా.. సొంత కథ తో వచ్చి ఉంటె ఇంకా బాగుండేది అని అనిపించింది నాకు. సంగీతం సో సో, కెమెరా పర్వాలేదు. సంభాషణలు బాగానే ఉన్నాయ్. పంచ్ డైలాగులు ఉన్నాయ్. బాగానే కష్టపడ్డారు.
సినిమా కాలక్షేపం బఠాణీ . చూడక పొతే నష్టం లేదు. చూసినా పర్వాలేదు.. వర్షం కురిసే సమయం లో బైటకి వెళ్ళే ఛాన్స్ లేక పొతే DVD లో కాళీ సమయం చూడొచ్చు . మనం అన్ని భాషల సినిమాలు చూడలేం అని మనకోసం మనవాళ్ళు తెగ కస్టపడి ఆ సినిమాని నానా హింస పెట్టేసి మనకోసం తెలుగు లో తీస్తే మరి మనం ఆ మాత్రం చెయ్యక పొతే ఎలా చెప్పండి.
5 comments:
శ్రీ, మీరు అర్జెంటుగా తెలుగు బఠానీ సినిమాల రివ్యూ ఆపి, ఆ ఒరిజినల్ మూవీస్ ని, కొరియన్ సిన్మాలని, మీకు నచ్చిన ఇతరదేశ చిత్రాలను పరిచయం చేయండి. తెలుసుకుని చూసేందుకు ప్రయత్నిస్తాం. తెలుగు సినిమాల రివ్యూ కై ఎన్నో సైట్లు ఎలానూ ఉన్నాయి. తెలుగువారికి పరిచయం చేయవలసిన ఇతరదేశ చిత్రాల వివరాల అవసరం ఉంది.
హ హ..మీ పుణ్యమా అని నాకో వంద రూపాయలు సేవ్ అయ్యాయి. నాకైతే ఇప్పటివరకు చూసిన రెండు సినిమాల్లో నాని ఏక్షన్ అస్సలు నచ్చలేదు. డైలాగ్ డెలివరీ అన్న కాన్సెప్టు తెలిసినట్టు లేదు ఓ అరిచేస్తుంటాడు. ఈ ఇన్స్పైర్డ్ సినిమాలు చూడ్డం శుద్ధ దండగ. మీరు ప్రపంచ భాషలన్నీ కవర్ చేస్తూ ఒక విధంగా తెలుగు ప్రేక్షకులకు మేలు చేస్తున్నారు :)
నేనూ నిన్ననే దీని కెమారా ప్రింట్ చూసాను. నాకు కూడా,రన్ ఆఫ్ ది మిల్గా ఒకేలే బానే తీశాడు అనిపించింది. ఏదో చూడని సినిమా అనుకోని చూడాలంతే!
జెమినీ టివీ ఇంటర్వ్యూలో, దర్శకుడు - "కొరియన్ సినిమాలు చూస్తుంటాను. అందులో ఎక్కడో బాగా నచ్చింది, మనసుకి పట్టిందే డెవలప్ చేసుకున్నాను" అని నిజం చెప్పాడు. అంత కంటే నిజం ఎలా చెప్తారు చెప్పండి!? కాకపోతే ఇంకో అబద్ధం చెప్పాడు. సినిమాకి ఇంస్పిరేషన్ మణిరత్నం ఘర్షణ సినిమాలో - కార్తిక్ చెల్లలి పెళ్ళిచూపులకి తండ్రిరానప్పుడు, ఎవరో "మరి ఇదే ఉంచుకున్న పిల్లలకి, అసలు పిల్లలకీ తేడా" అనో ఏదో డైలాగంటారుట. ఆ సీనుతో ప్రభావితమై ఈ సినిమా తీసానన్నాన్నాడు.నాజర్ పాత్రకీ, ఆ సినిమాకి నాకు లింక్ కుదర్లేదు. పెద్దగా బుర్రపెట్టని ఆ ఇంటర్వ్యూ చేసే పిల్లకికూడ ఎదో డిస్కనెక్ట్ అనిపించినా,తన ఉద్యోగం తను చేసింది.
బైదివే, "ది మిత్" ఇదివరకు బిట్స్ అండ్ పీసస్గానే చూశాను. ఎక్కువగా ఆ గుహలో సినిమాని చూశాను. మళ్ళీ ఇవ్వాళ పొద్దున్న ఆఫిసుకొచ్చేముందు స్టార్ మూవీస్లో సినిమా వస్తుంటే చూశాను. నిజమే! మగధీరకి "ది మిత్" నుంచి చాలా ఇంస్పిరేషన్ ఉంది. ఒక స్థాయిలో హీరోయిన్స్ ఫేసుల్లోనూ పోలికలు కనబడ్డాయంటే నమ్మండి! :)
మీరు ఆర్ట్ డైరెక్టర్ని ఇంటార్వ్యూ చేశాను అన్నారు. ఎక్కడ అచ్చేశారు?
ఎమిటోనండి.. మొదటి సినిమానే కాపీ అంటే కొంచం కష్టంగా ఉంది.. ఏదో చేతిలో నాలుగైదు సినిమాలు ఉండి 'ఖత' మీద కూర్చోడానికి టైం లేక కాపీ చేశారంటే అర్ధం చేసుకోవచ్చు...ప్చ్..
మీ రివ్యూ బాగుంది.. నా మిత్రుడు చూడొద్దని చెప్పడం వల్ల నేను తప్పించుకున్నా... నాయికానాయకులిద్దరిమీదా ఇంకా 'అబ్బిప్పిరాయాలు' ఏర్పడక పోవడం కూడా కారణం అనుకోండి...
వికాసం గారు
తప్పకుండా రాస్తాను ..
రీ రాజ గారు
ఆర్ట్ డైరెక్టర్ గారిది తొందరలో ఇక్కడ పెడతాను.. కొన్ని కారణాల వాళ్ళ అది ప్రచురించడం ఆలస్యం అయ్యింది
బుడుగు గారు, మురళి గారు
ధన్యవాదాలు
Post a Comment