Friday, August 28, 2009

పాపం మా ఫ్రెండ్. ...

పెళ్లి చేసుకుందాం అని ఇండియా బయలు దేరాడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి. వచ్చాక ఎలాగు మారక తప్పదు కదా అని డౌన్ టౌన్ కి దగ్గర గా ఇల్లు (అపార్ట్మెంట్ ) తీసుకుని ఒక రోజు ముందర షిఫ్ట్ అయ్యాడు. వెళ్ళే రోజు వెనక సైడ్ అపార్ట్మెంట్ దగ్గర కార్ ఆపి లగేజి తెచ్చుకుందాం అని పైకి వెళ్ళాడు. పాపం కిందకి వచ్చే చూసే సరికి కార్ కనపడలా . ఒక పక్క విమానం ఎక్కే సమయం దగ్గర పడుతోంది ఇంకో పక్క కార్ ఏమయిందో తెలిదు. చేసేది లేక పోలీసు రిపోర్ట్ ఇచ్చి విమానం ఎక్కాడు. దాని సంగతి కనుకోమని ఇంకో స్నేహితుడుకి చెప్పి వెళ్ళాడు . దాని సంగతి తెలిసే సరికి ఇంకో అయిదు రోజులు గడిచి పోయాయి. చివరకి అది తప్పు స్థలం లో పార్క్ చేసి నందుకు అపార్ట్మెంట్ management వాళ్ళు నియమించిన వాళ్ళు tow చేసారు. దానికి ఫైన్ గా దాదాపు రెండు వందలు డాలర్లు వదిలాయి.

పెళ్లి అయ్యి హనీ మూన్ గట్రా ముగించుకుని రాత్రి న్యూయార్క్ లో వాలాడు కొత్త పెళ్లి కూతురు తో కలిసి. కనెక్టింగ్ ఫ్లైట్ చాలా మాములుగా దైవాదీనం కదా. ఒకసారి ఇంకో గంట అన్నాడు .. మళ్ళా తూచ్ కాదు రెండు గంటలు అంటా అన్నాడు .. ఏదయితే ఎం రాత్రి తొమ్మిది కి రావాల్సిన వాళ్ళు , రెండుగంటలకి ఫ్లైట్ దిగారు. వాళ్ళ లగేజీ కి ఒక కార్ సరి పోదు కదా అని రెండు కార్లు వేసుకుని ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాం. అక్కడ నుంచి వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్లి లగేజి వాళ్ళ ఇంల్లో పెట్టె కార్యక్రమం నలుగురు చూస్తూండగా , మా వాడు ఇంకో ఫ్రెండు కింద కార్లు పార్క్ చేసి పైకి వచ్చారు. కొత్త పెళ్లి కూతురు కదా అని హారతి ఇద్దాం అని ఉత్సాహ పడిపోయింది మా కజిన్. ఎవరం సిగరెట్లు తాగేవాళ్ళం కాకా పోవడం వల్ల అగ్గిపెట్టె లేదు. వాళ్ళ స్టవ్ చూస్తె electric స్టవ్ సరే అని కొంచం కుస్తీ పది ఒక పేపర్ అంటించి దాంతో కర్పూరం వెలిగించాం.
\
గుమ్మం కాడ (గుమ్మం అంటే లేదు లెండి కాని ఫ్రంట్ డోర్ దగ్గరే ) పేర్లు చెప్పి లోపలి రండి అని హారతి ఇస్తున్నాం, ఈ లోపల వల్ల తలుపు దగ్గర ఉన్న (వీళ్ళు ఉండేది మూడో అంతస్తు ) కారిడార్ లో ఉన్న ఫైర్ అలారం మోగడం మొదలు పెట్టింది (హారతి దానికి అనుకున్నట్టు ఉంది ). అప్పుడు సమయం ఉదయం మూడు గంటలు. అది ఎక్కడ ఆగేలా లేదు అని అర్ధం అయింది. మేము మా వాడికి జాగర్తలు చెప్పి చల్లగా కిందకి చేరుకునే అప్పటికి పాపం నిద్ర మొహాలతో జనాలు గదులు కాళి చేస్తూ బయటకి వస్తున్నారు. అది false అలారం అని కొంతమందికి చెప్పి మేము మా ఇంటికి బయలుదేరాం.

దార్లో situation ఏంటో కనుక్కుందాం అని వాడికి కాల్ చేసాం. ఏముంది నాలుగు పోలీసు కార్లు, మూడు ఫైర్ ఇంజన్లు , నలుగు అంబులెన్స్ లు వచ్చాయి అని చల్లగా చెప్పాడు. వాళ్ళు వచ్చి అంతా వెతికి అంతా బాగానే ఉంది అని చెప్పే దాక అందరూ కింద నిద్రమొహాలతో కూర్చున్నాం అని చెప్పాడు. అది ఒక అరగంట పట్టింది.

పొద్దున్నే మా వాడు మళ్ళా ఫోన్ .. ఏంటి అంటే కార్ కనిపించడం లేదు అని. కార్ రాత్రి పార్క్ చేసాం కదా అంటే . అది డే కేర్ కి సంబందించిన పార్క్ ఏరియా దాంట్లో ఎక్కువ సేపు చెయ్యకూడదు. అందువల్ల మళ్ళా tow చేసారు అని తాజా వార్త. పొద్దున్నే మా వాడికి ఇంకో నూట యాభై డాలర్లు బొక్క.

3 comments:

కొత్త పాళీ said...

poor fellow!
Well, he's rich now - గృహలక్ష్మి వచ్చిందిగా! :)

తృష్ణ said...

పడమటి సంధ్యారాగం లో సీన్స్ గుర్తు వచ్చాయండి..!నిజంగా పాపం మీ ఫ్రెండ్!

తృష్ణ said...

పడమటి సంధ్యారాగం లో సీన్స్ గుర్తు వచ్చాయండి..!నిజంగా పాపం మీ ఫ్రెండ్!