గాడిద ...
కూసే గాడిద వచ్చి మేసే గాడిదని పాడుచేసింది ... కుక్క పని కుక్క గాడిద పని గాడిద చెయ్యాలి... అడ్డ గాడిద .. ఇవి అన్ని వినికుండా పెరగని వాళ్ళు వుండరు నాకు తెలిసి. గాడిద మీద బోలెడు కథలు ... నిజానికి వరసకు మా పెదనాన్న గారు ఒకరు (అట్లూరి పిచ్చేశ్వర రావు గారు , ఆయన్నని నేను ఎప్పుడు చూడలేదు అనుకోండి ) ఒక గాడిద ఆత్మ కథ అన్న పుస్తకం కూడా రాసారు.
చిన్నప్పుడు ఎప్పుడు బళ్ళో కానీ ఇంట్లో కానీ ఎక్కువ గా తిట్టే తిట్టు అడ్డ గాడిద .. అలా ఊరంతా అడ్డగాడిలా తిరగక పొతే ఏదన్నా తరగతి పుస్తకం చదువుకోవచ్చు కదా (తరగతి పుస్తకమే సుమా , ఏంటో ఈ పెద్ద వాళ్ళు ఎప్పుడు తరగతి పుస్తకమే, వాళ్ళు మాత్రం ఏదన్నా చడువ్కోవచ్చు .. ఎంత దారుణమో చూడండి.
అందరికి ఉండే ఇంకో అనుభవం దాడిగా డువానసిరా దీని తిప్పి చదవడవంది అని క్లాసు లో కామెడి చెయ్యని గాడి ఉండడు కదా.
పోనీ ఇన్ని తిడుతున్నారు కదా ఎమన్నా పని చెప్పకుండా ఉంటారా అంటే అది లేదు ... గాడిద చాకిరి చేయిస్తారు
అడ్డ గాడిదా అంటారు అంటే గాడిదలు ఎమన్నా నిలువుగా ఉంటాయ ? దీనికి సమాధానం తెలిసి చెప్పకపోయారో...
1 comment:
నాక్కూడా గాడిదకి సంబంధించి బోల్డన్ని అనుభవాలు ఉన్నాయండి.. ఎవరైనా సమాధానం చెబుతారేమో చూద్దాం.. నాకూ తెలియదు మరి :-)
Post a Comment